తిరుమలలో ఈ నెల 25-27 తేదీల్లో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. తొలి రోజు మలయప్పస్వామి వారు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనం, మూడో రోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. అటు ఉభయ దేవేరులు ప్రత్యేక పల్లకిల్లో పరిణయోత్సవ మండపానికి వేంచేస్తారు. ఆపై కళ్యాణమహోత్సవం కన్నుల పండుగగా జరగనుంది.