NDL: ప్రకాశం జిల్లాకు చెందిన రావి నాగమణి, కుటుంబ సభ్యులు ఇవాళ శ్రీశైలంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం చెల్లించారు. ఈ మేరకు వారు స్థానిక అన్న ప్రసాదం విభాగం కార్యాలయానికి చేరుకుని సహాయ కార్యనిర్వహణాధికారి సతీశ్ మల్లిక్‌ను కలిసి విరాళం అందజేశారు. విరాళం చెల్లించిన దాతకు రసీదు, ప్రసాదాలు అందించి, శేష వస్త్రాలతో సన్మానించారు.