HYDలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవనశైలి ఆందోళనకరంగా మారుతోంది. వారం అంతా పని ఒత్తిడిలో గడిపి వీకెండ్లో ఉపశమనం కోసం కొందరు మత్తు పదార్థాల వైపు మొగ్గుచూపుతున్నారు. వర్క్ ప్రెషర్ తట్టుకోలేక, ఏదో ఒకదానికి బానిస కాక తప్పడం లేదని కొందరు ఉద్యోగులు విచారణలో చెబుతున్నట్లు పోలీసులు, వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ధోరణి యువత ఆరోగ్యంపై, సామాజిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోంది.