KRNL: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పూడి శ్రీహరి అరెస్ట్‌ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఖండించారు. పత్తికొండలో ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఈ అరెస్ట్ కూటమి ప్రభుత్వ దుర్మార్గపు విధానాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని, వెంటనే పూడి శ్రీహరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.