RR: షాద్నగర్ బస్సు స్టేషన్ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు నిత్యం నిరీక్షణ తప్పడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సులు సరైన సమయానికి రాకపోవడంతో ఆఫీసులకు, పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరారు.