WNP: మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడిపిన ఇద్దరికి గురువారం జిల్లా కోర్టు రూ.1000 చొప్పున జరిమానా విధించిందని గోపాలపేట ఎస్సై జగన్ మోహన్ తెలిపారు. రేవల్లి మండలానికి చెందిన పర్వతాలు, గోపాలపేట మండలానికి చెందిన శివ కుమార్‌పై జరిమానా విధించారన్నారు. ఎవరైనా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.