VKB: వికారాబాద్ మండల పరిధిలోని కొత్లాపూర్ గ్రామ రేషన్ వినియోగదారులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు ఎండలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. గ్రామంలోని రేషన్ దుకాణం వద్ద డీలర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.