తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సమయం చూసి కొందరు నేతలు పార్టీ ఛేంజ్ అవుతున్నారు. కొత్త పార్టీలో ప్రాధాన్యం, పదవులపై డిస్కస్ చేసి మరీ గోడ దూకెస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కీలకమైన నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత కొన్నిరోజుల నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ వార్తలను పొంగులేటి తోసిపుచ్చారు. కానీ ఈసారి మాత్రం కాస్తా సైలంట్ గా ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్రానికి సిద్దంగా ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల అభిమానం, దీవెనలను అందుకున్న వారే లీడర్ అని అనడంతో.. ఆయన పార్టీ మార్పు గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా వాసులు ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతుందని అన్నారు. నాలుగున్నర ఏళ్ల నుంచి తనకు ఏ పదవీ లేదని, అయినప్పటికీ ప్రజలతో కలిసే ఉన్నానని వివరించారు. తనకు పార్టీలో ప్రయారిటీ ఇవ్వడం లేదని ఇండైరెక్టుగా చెప్పేశారు. దీంతో ఆయన పార్టీ మార్పు తప్పదని విశ్లేషకులు అంటున్నారు.
పార్టీ మార్పు గురించి తన సన్నిహితులు, అనుచరులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చించారని పొలిటికల్ సర్కిళ్లలో డిస్కసన్ జరుగుతుంది. తన ఫాలొవర్స్ అభిప్రాయం తెలుసుకునేందుకే ఈ నెల 10వ తేదీ (మంగళవారం) నుంచి వరసగా సమావేశాలు నిర్వహిస్తారట. అందులో వారి నుంచి సలహాలు తీసుకుని, వారు చెప్పే అంశాల ఆధారంగా పార్టీ మార్పు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆయనకు ఉన్న ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తిరిగి ఆ పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఆ తర్వాత వైసీపీలో చేరి, తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో వైసీపీ నుంచి ఖమ్మం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారితే ఆయనకు ఉన్న ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుంది. తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ప్రభావం అంతగా లేదు. సో.. బీజేపీలోకి వెళ్లడానికే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అవుతారట. ఆ తర్వాత పార్టీ మార్పు గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కీలకమైన నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పొంగులేటితో సంప్రదింపులు జరుపుతుంది. ఆయన కూడా పార్టీలో చేరేందుకు అంగీకారం తెలిపారని విశ్వసనీయ సమాచారం. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.
ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమర్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పొసగడం లేదు. ఆయనకు మంత్రి పదవీ ఇవ్వడం ఆయనకు నచ్చడం లేదు. జిల్లాలో ఇద్దరూ నేతల మధ్య వైరం కంటిన్యూ అవుతోంది. ఇటీవల పువ్వాడ అజయ్ మీడియాతో కూడా ఇదే విషయం చెప్పారు. దీంతో తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుకున్నారు. అందుకే ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తనకు పదవీ లేదని చెప్పడం వెనక కారణం.. ఇదే కారణం అయి ఉంటుందని పొలిటికల్ ఆనలిస్టులు అంటున్నారు. ఏ పదవీ లేకుండా నాలుగున్నరేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారని వారు విశ్లేషిస్తున్నారు.