ప్రకాశం: కనిగిరి వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం పెదచెర్లోపల్లిలోని స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించాలని, ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.