PLD: ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని చిలకలూరిపేటలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్యాంగులతో కలిసి బస్సులో స్వయంగా ప్రయాణిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.