SDPT: దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సిద్దిపేటలోని ఓ టీ పాయింట్‌లో లంచం స్వీకరిస్తుండగా బుధవారం అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: ఎమ్మిగనూరు మండలంలో రెవెన్యూ శాఖ ఉద్యోగులు రైతుల,ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదంటూ JC Dr. నవ్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కడిమెట్ల గ్రామంలో రీసర్వేను పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో VROలు, సర్వేయర్లురెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? లేదా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ప్రశ్నించారు.
MDK: స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొగడంతో యువతలో ఉత్సాహం పెరిగింది. విదేశాలలో ఉండే యువకులు సైతం పల్లెలకు పరుగులు పెడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ శంకరప్ప గత 25 సంవత్సరాలు పాలించి శంకరంపేటను అభివృద్ధి చేశారని, ఆయనను స్ఫూర్తి తీసుకొని ఆయన మనవడు కంచర్ల చంద్రశేఖర్ అమెరికా నుంచి ఉద్యోగం వదిలీ చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చేరుకున్నారు.
NDL: ముస్లిం సోదర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి NMD ఫరూక్ శుభవార్త చెప్పారు. రంజాన్ మాసం పురస్కరించుకొని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు పనివేళల కంటే ఓ గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అటు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ సీఎం చంద్రబాబుకు ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఒక్కరూ హాఫ్ సెంచరీ చేయలేదు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, పాండ్యా, అక్షర్ రెండేసి వికెట్లు సాధించారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఈ విక్టరీ పెద్ద ఊరట అనే చెప్పాలి.
ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ప్రభుత్వం తక్షణం రూ.2 వేల కోట్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు సీపీఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్లుగా పాలక పార్టీలు ప్రాజెక్టును ఓటు బ్యాంకుగా మలుచుకుని లబ్ధి పొందుతున్నాయే తప్ప పూర్తి చేయలేదన్నారు.
ASR: పాడేరు మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముచ్చటించారు. పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు.
అనంతపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కి వ్యతిరేకంగా ఈనెల 14 నుంచి 20 వరకు గుంతకల్లు పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడదామని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం సీపీఎం కార్యాలయంలో వామపక్ష పార్టీ నాయకులతో కలిసి రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు.
NDL: పగిడ్యాల మండలంలోని ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి రెండు పైపుల ద్వారా 450 క్యూసెక్కుల నీటిని కేసీ కాలువకు విడుదల చేసినట్లు సంబంధిత ఏఈ నరేష్ తెలిపారు. కెసీ కాలువలో నీటిమట్టం తగ్గిపోవడంతో అయుక్తత రైతులు పంటలు ఎండిపోతున్నాయి అని ఆందోళన చెందడంతో రైతుల సౌకర్యాలు కేసి కాల్వకు నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
NLR; నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సాయంత్రం మాఘ పౌర్ణమి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. విశేష పుష్ప అలంకరణ, మంగళ వాయిద్యాలు, వేద పండితుల నడుమ శ్రీవారికి గరుడ సేవా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ASR: గూడెం కొత్తవీధి మండలంలోని జర్రెల పరిధిలోని గ్రామాలన్నింటినీ పర్యవేక్షణ చేశామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం తెలిపారు. జర్రెల పంచాయతీ ప్రధాన రహదారి నుంచి మిగిలిన గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాగే అక్కడ మధ్యలో కొండవాగుపై వంతెన నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ASR: గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. బుధవారం గూడెం కొత్తవీధి మండలంలోని జర్రెల ప్రాంతంలో పర్యటించారు. ఈ ఏడాది గంజాయి తగ్గుముఖం పట్టిందని అన్నారు. జిల్లా కలెక్టర్ సహకారంతో పోలీస్ శాఖ తరఫున గిరిజనులకు అండగా ఉంటూ, గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుందని తెలిపారు.
KRNL: వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని ఉపాధి కల్పించాలని సీఐటీయు ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మిగనూరులో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్యకి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి రాముడు, గ్రామ వార్డు వాలంటర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సురేష్, అధ్యక్షురాలు శిరీష మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వాలెంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు.
SRCL: రాజన్న సిరిసిల్ల పట్టణంలో పౌష్టికాహారం, వాష్ కార్యక్రమాలపై బుధవారం అవగాహన నిర్వహించినట్టు డీఆర్డీవో గొట్టే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ గర్భం దాల్చిన నుంచి 1,000 రోజుల ప్రణాళిక చేతుల శుభ్రంగా కడుక్కోవడం, పెరటి కోళ్ల పెంపకం వంటి వాటిపై శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు.
CTR: జిల్లాలో స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలతో పాటు సమగ్ర వివరాలను క్రోడీకరించే విధంగా రూపొందించిన ‘లోకోస్ యాప్’ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. బుధవారం చిత్తూరులోని జిల్లా సమాఖ్య సమావేశంలో జిల్లాలోనీ అకౌంటెంట్ల సమావేశం జరిగింది. యాప్ ఉపయోగం గురించి వివరించారు.