NDL: బీసీ కార్పొరేషన్ కింద రుణాల మంజూరుకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు అవుకు మండల ఎంపీడీవో కార్యాలయ అధికారులు తెలిపారు. 21 నుంచి 60 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. 50% సబ్సిడీతో అందించే ఈ రుణాలకు.. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు https://apobmms.apcfss.inను సంప్రదించాలని సూచించారు.
కోనసీమ: మండల కేంద్రం అయిన రావులపాలెం జాతీయ రహదారిపై విందు రెష్టారెంట్ ఎదురుగా గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని అరటి రైతు తన మోటార్ సైకిల్‌తో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
NDL: కల్లూరు అర్బన్ 19వ వార్డు ఇంజనీర్స్ కాలనీలో అభివృద్ధి పనుల్లో భాగంగా గురువారం సీసీరోడ్ల నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమం జరిగింది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని, పనులను ప్రారంభించారు. మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి పాల్గొన్నారు.
PLD: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, భారత కోకిల సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా గురువారం నూజెండ్ల మండలం పెద్దవరం పాఠశాలలో సరోజినీ నాయుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఆమె జయంతిని భారత దేశంలో మహిళా దినోత్సవంగా జరుపుకుంటారని తెలియజేస్తూ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.
TG: నటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా, కుటుంబ వివాదాల నేపథ్యంలో మీడియా కవరేజ్‌కు వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేసిన విషయం తెలిసిందే.
పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కొమరాడ మండలంలో గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు స్దానిక MPDO మళల్లికార్దునరావు మాట్లాడుతూ.. కలెక్టర్ జడ్పీ ఉన్నత పాఠశాలల తనిఖీ చేస్తారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులంతా సమీక్ష సమావేశానికి హాజరుకావాలన్నారు.
NLR: కలువాయి మండలం కుల్లూరులో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం దంపతులు, చల్ల సీతారామ్, కమల ఆధ్వర్యంలో ఆలయం నూతనంగా నిర్మించారు. వడ్డెరల కుల ఆది గురువు ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామి జీ సారథ్యంలో ప్రత్యేక యజ్ఞ యాగాలు జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
BDK: చండ్రుగొండలోని కేజీబీవీ బాలికల వసతి గృహంలో గురువారం విద్యార్థులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచాయి. ఎంఈవో సత్యనారాయణ వివరాల ప్రకారం.. పడుకొని ఉన్న ఇద్దరు బాలికలపై ఎలుకలు దాడి చేసి స్వల్పంగా గాయపరిచాయని చెప్పారు. వసతి గృహాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
VZM: గుమ్మలక్ష్మీపురం వైసీపి మండల అధ్యక్షుడిగా కుంబురుకు దీనమయ్యను నియమిస్తూ వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు జారి చేసింది. ఈ సందర్భంగా దీనమయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మూడోసారి మండల అధ్యక్షునిగా నియమించిన అదిష్టానికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
KMM: బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15వ తేదీన కూసుమంచి కేంద్రంలో నిర్వహించబోయే, జయంతి ఉత్సవాల కోసం గురువారం కూసుమంచి తహసీల్దార్ కరుణ ఉత్సవాల స్థలాన్ని స్థానిక బంజారాలతో కలిసి పరిశీలించారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
JGL: కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామశివారులో ఓ వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు గ్రామస్థులు గురువారం గుర్తించారు. మృతుడికి 30 ఏళ్ళు ఉంటాయన్నారు. బావి ఒడ్డు పై అంగీ, చెప్పులు ఉండగా.. మృతుడి ఒంటిపై పాయింట్ ఉంది. ఇది హత్యనా.. లేక ఆత్మహత్యనా తెలియాల్సి ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
NDL: పాణ్యం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పాణ్యం సమీపంలో ఉన్న సుగాలి మెట్ట వద్ద ట్రాక్టరు బైక్ ఢీకొన్నాయి. ట్రాక్టరు బైక్ ఢీకొన్న ఘటనలో గురువారం ఒకరు మృతి చెందారు. పాణ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని యొక్క వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
KRNL: పెద్దకడబూరు గ్రామంలో కటికె మిన్నుల్లాకు చెందిన రూ. 60 వేలు విలువ చేసే మూడు పొట్టేళ్లను చిరుత పులి పొట్టన పెట్టుకుందని బాదితుడు కన్నీరు మున్నీరుగా విలపించారు. దేవుడి కోసం మూడు పొట్టేళ్లను పెంచినట్లు, అయితే రాత్రి ఇంటి వద్ద కట్టేసి ఉండగా మూడు పొట్టేళ్లను చిరుత పులి చంపేసిందని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
BDK: సింగరేణి ఇల్లందు ఏరియాలో SAP ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ పై గురువారం ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేట్ ERP విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం వి.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలోనే మాన్యువల్ ఫైల్ డిస్పాచ్ నుంచి ఆన్‌లైన్ విధానానికి మారుతామని అన్నారు. ఈ మార్పు సమయం, శ్రమను ఆదా చేస్తుందని తెలిపారు.
PLD: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 26న వివిధ శైవక్షేత్రాలు వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు 58 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డీఎం బత్తుల వీరాస్వామి తెలిపారు. పాలువాయి జంక్షన్ నుంచి సత్రశాల వరకు గల రహదారిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 58 బస్సులను నడుపుతామని టిక్కెట్ ధరలో ఎలాంటి పెరుగుదల ఉండదన్నారు.