HYD: నల్లకుంట శంకరమఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ శారదాంబ అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలతో దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయింది. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ATP: రాప్తాడు నియోజకవర్గం వెంకటాపురం గ్రామంలోని శ్రీ ఎల్లమ్మ అమ్మవారు నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం అందించారు.
KRNL: జిల్లా కల్లూరు మండలం బస్తీపాడు గ్రామానికి చెందిన కురువ ఎల్ల రాముడు(33) ఇవాళ కారు ఢీకొని మృతి చెందాడు. ఉలిందకొండ నేషనల్ హైవేలో గొర్రెలను రోడ్డు దాటిస్తుండగా కర్నూల్ నుంచి వేగంగా వస్తున్న కారు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. 33 గొర్రెలతో సహా కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
TG: అంబేడ్కర్ వర్సిటీ 26వ స్నాతకోత్సవంలో గోరటి వెంకన్న, ప్రేమ్ రావత్‌లు గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సాహిత్య విభాగంలో గోరటి వెంకన్న, పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచడం ప్రేమ్ రావత్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులు ప్రదానం చేశారు. దీంతో పాటు 86 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 60,288 మందికి పట్టాలను అందజేశారు.
ATP: ఉంగుటూరు( M) చిన్న వెల్లమిల్లి గ్రామంలో రోడ్డు పక్కనే డంపింగ్ యార్డుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారుల గుండా నిత్యం ప్రజలు, రైతులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రహదారి గుండా వెళ్లాలంటే దుర్వాసన వల్ల ముక్కు మూసుకుని వెళ్ళవలసి వస్తుందని వాపోతున్నారు. దీనివలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
SKLM: పాతపట్నంలో వెలసియున్న శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శరన్నవరాత్రుల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అమ్మవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
WNP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులది కీలక పాత్ర ఉంటుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం రిటర్నింగ్ అధికారులతో ఆయన సమావేశమై దిశా నిర్దేశం చేశారు. వచ్చేనెల 9న నోటిఫికేషన్ విడుదల చేసి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేసుకుని తగిన సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.
VSP: భీమిలో చరిత్ర కలిగిన క్లాక్ టవర్ శిథిలావస్థకు చేరుకుంది. దీనిపై పత్రికల్లో పలు కథనాలు వచ్చాయి. దీంతో మంగళవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈమేరకు క్లాక్ టవర్‌ను పరిశీలించారు. రూ.30 లక్షలతో మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంద&...
NLG: చిట్యాలకు చెందిన ప్రముఖ సాహితీవేత్త డా. ఏనుగు నరసింహా రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు సంచాలకులుగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన, కొద్ది కాలంలోనే బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో గిన్నిస్ బుక్‌లో స్థానం పొందటం హర్షనీయమని పలువురు కొనియాడారు. ఈ నెల 29న టూరిజం శాఖతో కలిసి అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటు చేసి వరల్డ్ రికార్డు పొందారని పేర్కొన్నారు.
చిత్తూరు మురకంబట్టు సమీపంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ యువకులను నగరవనం సమీపంలో సోమవారం సాయంత్రం బండపల్లి గ్రామస్థులు చితక్కొట్టారు. ఆ ముగ్గురు యువకుల్లో ఒకరు తప్పించుకోగా మరో ఇద్దరిని తాలూకా పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితులను హేమంత్, మహేష్, కిషోర్‌గా గుర్తించారు.
SRD: దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా సాయుధ పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ, మోటర్ వెహికల్ సెక్షన్‌లో వాహన పూజలను మంగళవారం జిల్లా SP పరితోష్ పంకజ్ నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షించడంలో, నేరాలను నియంత్రించడంలో జిల్లా పోలీసులు సఫలీకృతం అవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు.
సత్యసాయి: ధర్మవరంలో బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీకి కొత్త కార్యాలయం ఏర్పాటు కావడం కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోందని మంత్రి తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ కార్యాలయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KRNL: ఆదోని పట్టణ శివారు లక్ష్మమ్మ నగర్‌లో వర్షాల ప్రభావంతో రోడ్లు పాడైపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 700 మంది నివసించే ఈ కాలనీలో రహదారి వర్షపు నీటితో కోతకు గురై, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. సమస్యపై ఎమ్మెల్యే పార్థసారధి, మున్సిపల్ కమిషనర్ తక్షణ చర్యలు తీసుకుని ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
BDK: భద్రాచలంలో వీరలక్ష్మి రూపంలో అమ్మవారి దర్శనం భద్రాచలం పట్టణంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో మంగళవారం 8వ రోజు అమ్మవారు వీరలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వీరలక్ష్మి అమ్మవారి దర్శన విశిష్టత గురించి భక్తులకు ఆలయ అర్చకులు వివరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
E.G: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా కడియం మండలంలోని వీరవరం గ్రామంలో మంగళవారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు, వృద్దులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల రాము, ఆదిమూలం సాయి తదితరులు పాల్గొన్నారు.