రాజ్యసభలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని, విభజన తర్వాత రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందని ఈ సందర్బంగా తెలిపారు.
మేడ్చల్: ఫ్రీడం ఆయిల్ కంపెనీ ఎండీ ప్రదీప్ చౌదరిను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిసి వారిని శాలువాతో సన్మానించారు. గతంలో తనకు ఇచ్చిన మద్దతు, సీఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా బాలాజీ నగర్‌లో సుమారు 2.5 ఎకరాలలో ఫ్రీడం పార్కును అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.
VZM: వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు కల్పించి రైతుకు మేలు చేస్తామని ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు తెలిపారు. విజయవాడ మార్క్ ఫెడ్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయసాగులో ఆధునిక పద్ధతులు అవలంభించే విధంగా రైతుల సహకారం ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందన్నారు.
VZM: ఢిల్లీలోని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హౌస్‌లో స్పీకర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో భాగమైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును స్పీకర్‌కు పరిచయం చేశారు. అనంతరం పలు సమస్యలపై చర్చించారు.
VZM: ఆధార్ నమోదులోను, అప్డేషన్‌లోనూ తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆధార్ నమోదు పై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు, మహిళలకు, శాశ్వతంగా మంచాన పడి ఉన్నవారికి, ట్రాన్స్ జెండర్లను గుర్తించి ఆధార్ నమోదు చేయాలన్నారు.
W.G: మండవల్లి మండలం కానుకోల్లు సమీపంలో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన గురువారం చోటు చేసుకుంది. కైకలూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారుకి అడ్డంగా గేదెలు అడ్డు వచ్చాయి. దీంతో కారు అదుపు తప్ప రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు కారులతో ఉన్న ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. వారు విజయవాడ చెందిన వారిగా గుర్తించారు.
HYD: బన్సీలాల్ పేటకు చెందిన సిల్వరి పరమేష్ కుమార్తె వర్షిత ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ నేపథ్యంలో గురువారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో వర్షితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో మున్ముందు మంచి విజయాలు సాధించాలని అభినందించారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో అర్హులైన రైతాంగానికి ఈనెల 16న సూక్ష్మ సాగునీటి సేద్య పరికరాల పంపిణీ చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 11:30 గంటలకు పంపిణీ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
GDWL: అలంపూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు బ్రిడ్జి దిగువన తుంగభద్రా నదిలో గురువారం గుర్తుతెలియని శవం లభ్యమైనట్లు అలంపూర్ పోలీసులు తెలిపారు. ఎవరైనా మృతుడిని గుర్తించినట్లయితే అలంపూర్ పీఎస్ 8712670285 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. మృతుడి వయస్సు దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
GDWL: జోగులాంబ ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని NSUI జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులోని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి సోమరాజుకు వినతిపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల నుంచి జోగులాంబ ఆలయం, పాగుంట ఆలయాలకు అధికారిగా పనిచేస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించాడు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, పార్కింగ్ ప్రదేశాల్లో ఆలయంలోకి వచ్చి వెళ్లే దారులు, క్యూ లైన్లలో, కళ్యాణ కట్ట, ధర్మ గుండం, ఆలయ ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్, ఆలయ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శివరాత్రి వేడుకను ఘనంగా నిర్వహించాలని సూచించాడు.
ASR: అభివృద్ధిలో పీసా కమిటీలే కీలకమని వై.రామవరం ఎంపీడీవో రవి కిషోర్ అన్నారు. పీసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బందికి గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహజ వనరులు ఇతర అభివృద్ధి పనులపై పీసా గ్రామ కమిటీలు స్వయం నిర్ణయాధికారం మేరకే అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
PDPL: సింగరేణి నర్సరీలలో పనిచేస్తున్న కార్మికులకు జీఓ ప్రకారం వేతనాలు, సీఎంపీఎఫ్, బోనస్, వైద్యం చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న, రాష్ట్ర నాయకులు నరేష్ సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ను కోరారు. గురువారం గోదావరిఖనిలో సీఎండీని కలిసి వినతిపత్రం అందజేశారు.
MNCL: వేమనపల్లి మండలంలోని నీల్వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం పరిధి కాటేపల్లి అటవీ బీట్ పరిధిలో అక్రమంగా చెట్లు నరికిన మానేపల్లి రాజన్న, మానేపల్లి నరేష్ పై కేసు నమోదు చేసి చెన్నూరు కోర్టులో హాజరు పరిచినట్లు నీల్వాయి ఎఫ్‌ఆర్‌ఓ అప్పలకొండ తెలిపారు. అక్రమంగా చెట్లను నరికి భూమి చదును చేసినందుకు అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ELR: ఎక్కడైనా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటే వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియచేయాలంటూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేశారు. గురువారం స్ధానిక కలెక్టరేట్‌లో బర్డ్ ఫ్లూ సంబంధిత అంశంపై జిల్లాలో తీసుకున్న చర్యలను వివరించారు. దీనిపై కమాండ్ కంట్రోల్ 9966779943 నంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.