JGL: ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీఈబీ (టీచర్స్ భవన్)లో జిల్లా స్థాయి కౌమార విద్య పోస్టర్ మేళా పోటీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 83 పాఠశాలల నుంచి విద్యార్థులు గైడ్ టీచర్లతో కలిసి పాల్గొని కౌమార విద్యపై పోస్టర్లు రూపొందించారు. న్యాయనిర్ణేతలుగా జీవశాస్త్ర ఉపాధ్యాయులు తిరుపతి, పవన్ కుమార్, శ్రీనివాస్ పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు.
ATP: డి. హీరేహల్ మండలం మురడి గ్రామంలో వెలసిన ప్రసిద్ద ఆంజనేయుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. వేకువజామునే స్వామి మూల విరాట్‌కి సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి పుష్పాలు, తమలాపాకుల హారాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.
ప్రకాశం: దొనకొండ మండలంలోని భూమనపల్లి, మంగినపూడి, రుద్రసముద్రం, ఇంద్లచరువు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని అర్జీలు స్వీకరించారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన సమస్యలను స్థానికులు వివరించారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.
మూసీ పరీవాహకాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా 55 కి.మీలను ప్రభుత్వం ఐదు దశలుగా విభజించింది.జోన్ 1- గండిపేట, రాజేంద్రనగర్ ల నుంచి గాంధీ సరోవర్ వరకు 21కి.మీజోన్ 2 – గాంధీ సరోవర్ నుంచి పురానాపూల్ వరకు 6 కి.మీజోన్ 3 – పూరానాపూల్ నుంచి MGBS వరకు 4 కి.మీజోన్4 – MGBS నుంచి ఉప్పల్ వరకు 8 కి.మీజోన్ 5- ఉప్పల్ నుంచి గౌరెళ్లి వరకు 16 కి.మీ.
ELR: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్లను వర్కర్లుగా ప్రమోట్ చేయడానికి కొత్త మార్గదర్శకాలను(G.O) విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం, 50% వర్కర్ పోస్టులు హెల్పర్లకే కేటాయించనుంది. టెన్త్ ఉత్తీర్ణత, ఐదేళ్ల సర్వీసు, ఫిట్నెస్ తప్పనిసరి. నియామక సంవత్సరం జులై 1 నాటికి 50 ఏళ్లు దాటకూడదు. సీనియారిటీ, వయస్సు, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పిస్తారు.
TG: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మరో రూ. 640 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో రాష్ట్రానికి 2024-25 ఆర్థిక సంవత్సరం నిధులు పూర్తిగా అందగా.. 2025-26 ఆర్థిక సంవత్సరం కింద మరో 1,255 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. వీటిని కూడా విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
KRNL: పెద్దకడుబూరులో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో స్వచ్ఛ రథం వాహనాన్ని టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో పరిశుభ్రత, వ్యర్థాల సక్రమ నిర్వహణకు వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ప్రజలు పరిశుభ్రతపై మరింత అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
‘సైయారా’తో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ యంగ్ హీరో అహాన్ పాండే.. వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. అనీష్ బజ్మీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన.. తాజాగా మరో రెండు చిత్రాలకు సంతకం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఆనంద్ ఎల్ రాయ్ తన తదుపరి చిత్రంలో మహాభారతంలోని ‘కర్ణ’ పాత్ర కోసం అహాన్‌ను ఎంపిక చేసినట్లు టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
AP: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాభివృద్ధిని చూసి YCP చీఫ్ జగన్ ఓర్వలేకపోతున్నారని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ విమర్శించారు. తమ పాలనలో విచ్చలవిడిగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్నారని ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా AP నిలుస్తున్న వేళ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
PDPL: ధర్మారం మండలంలో ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం ఐదు కేంద్రాలలో 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. నంది మేడారం జడ్పీ హైస్కూల్‌లో ఇన్విజిలేటర్లు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఏకాగ్రతతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని” MLA విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు.
NRPT: దామరగిద్ద మండలానికి చెందిన పలువురు రైతులు క్షేత్ర పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాలను సందర్శించారు. అక్కడ అమలవుతున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై నిపుణుల ద్వారా అవగాహన పెంపొందించుకున్నారు. రసాయన ఎరువులు లేకుండా జీవామృతం తయారీ, మట్టి సారాన్ని కాపాడుకుంటూ పంటలు సాగు చేసే విధానాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
MBNR:హన్వాడ మండల కేంద్రంలోని 167వ జాతీయ రహదారిపై మురుగునీరు పారుతుండటంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
VZM: ఈనెల 15న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో వినియోగదారుల కమిషన్ DSO మురళీనాథ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు సరైన అవగాహన కల్పించాలని DSO తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూనికల కొలతలు అధికారి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
VSP: ఏయూ పరీక్షల ఫలితాలను విద్యార్థులు నేరుగా వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చని వీసీ ఆచార్య జీ.పీ. రాజశేఖర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మనమిత్ర యాప్ ఉపయోగించి ఫలితాలు పొందే విధానాన్ని డెమో ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం ఏయూ విద్యార్థిని వాట్సాప్ ఉపయోగించి తన రిజిస్టర్ నంబర్లో ఫలితాలు పొందే విధానం లైవ్లో చూపించారు.