KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా సాగింది. భద్రాచలం తర్వాత రెండవ అతిపెద్ద కళ్యాణ మహోత్సవం ఇల్లందకుంటలో జరుగుతుండడంతో జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తునకి తరలివచ్చారు. హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
NDL: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ సందర్భంగా పగిడ్యాలలో సోమవారం పోట్టేల పందెములు నిర్వహిస్తున్నట్లు కార్య నిర్వాహకులు బి.నాగేశ్వ రెడ్డి, శివరామి రెడ్డిలు ఆదివారం తెలిపారు. గెలుపొందిన వారికి రూ.8.000, రూ.6.000, రూ.4.000 మూడు బహుమతులు కలవన్నారు. వివరములకై సెల్:9949493857ను సంప్రదించాలని తెలిపారు.
KDP: ప్రమాదవశాత్తు, సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బాదుల్లా పేర్కొన్నారు. ఆదివారం కడపలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చనిపోయిన కార్మికుల కుటుంబాలు అందరికీ సహాయం అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
KDP: గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2432 టిడ్కో ఇళ్లను ప్రజలకు పంపిణీ చేయలేదని కడప ఎమ్మెల్యే మాధవి ఆరోపించారు. కడపలోని లక్ష్మీ నగర్లో టిడ్కో ఇళ్లకు రోడ్ పనులను ఆమె ప్రారంభించారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ హయాంలో ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ఇళ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు.
GNTR: నగరపాలక సంస్థలో సోమవారం (ఏప్రిల్ 7) పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జనన మరణ నమోదు కార్యాలయం (పార్కింగ్ వద్ద) నిర్వహిస్తామని జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. అదే రోజున కౌన్సిల్ హాల్లో వార్షిక బడ్జెట్ సమావేశం జరుగనున్నందున ఈ స్థల మార్పు జరిగిందన్నారు.
HYD: మే 20న నిర్వహించే సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం ఈనెల 8న బాగ్ లింగంపల్లిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాల్ రాజు తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సులో పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక ధోరణులపై చర్చిస్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
SRCL: ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాలువాతో ఆశీర్వచనం అందించి ప్రసాదం అందజేశారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఆదివారం హనుమాన్ భజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రతేక పూజలు నిర్వహించారు. డీఎస్పీ సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులను కనిగిరి బ్రాహ్మణ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
CTR: పీలేరు పట్టణంలోని ప్రకాశం రోడ్డులో గల శ్రీరాములవారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
PPM: కురుపాం (M)సింగుపురం గ్రామంలో గత 20 రోజులుగా శ్రీ జాకరమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో జరిగిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌లో విజేతగా నిలిచిన పోలీస్ టీంకు అరకు మాజీ పార్లమెంట్ సభ్యులు వైరుచర్ల ప్రదీప్ చంద్ర దేవ్ చేతులు మీదగా రూ.20,000 క్యాష్ ప్రైస్‌తో పాటు ట్రోపీను అందజేశారు. ప్రతిభను వెలుగు తీసేందుకే క్రీడా పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
TPT: తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామివారి ఆలయం నవమి శోభను సంతరించుకుంది. రాములవారి దర్శనార్థం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో రామాలయం వెలిగిపోతోంది. ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ మంచి నీరు, మజ్జిగ పంపిణీ చేసింది.
ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా మండల క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులపై దాడులు అరికట్టాలంటూ వారు నినాదాలు చేశారు. ప్రవీణ్ పగడాల కేసులో న్యాయం జరగాలంటూ పలువురు నినదించారు. దర్యాప్తు సక్రమంగా జరగాలని కోరారు. నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు.
MNCL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ళలోపు చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్బీఎస్‌కే బృందాలతో 37,920 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
SKLM: సీతంపేట మండలం దుగ్గి గ్రామం లో పీఎమ్ జన్ మన్ పథకం ద్వారా రూ.8.లక్షల అంచనా విలువతో 10000 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంక్, ఇంటి ఇంటికి మంజూరైన నీటి కుళాయిలుకు ఆదివారం పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి శుభ్రమైన నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
CTR: బోయకొండ గంగమ్మకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. హుండీ ద్వారా ఏడాదికి రూ. 5.52 కోట్లు సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు. గతేడాది కంటే ఇది రూ. 72 లక్షలు అధికమని చెప్పారు. అలాగే బంగారు, వెండి సైతం భారీగా సమకూరిందన్నారు. ఆలయ ఆదాయానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.