ATP: రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో అర్హులైన రైతాంగానికి ఈనెల 16న సూక్ష్మ సాగునీటి సేద్య పరికరాల పంపిణీ చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 11:30 గంటలకు పంపిణీ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
GDWL: అలంపూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు బ్రిడ్జి దిగువన తుంగభద్రా నదిలో గురువారం గుర్తుతెలియని శవం లభ్యమైనట్లు అలంపూర్ పోలీసులు తెలిపారు. ఎవరైనా మృతుడిని గుర్తించినట్లయితే అలంపూర్ పీఎస్ 8712670285 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. మృతుడి వయస్సు దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
GDWL: జోగులాంబ ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని NSUI జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులోని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి సోమరాజుకు వినతిపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల నుంచి జోగులాంబ ఆలయం, పాగుంట ఆలయాలకు అధికారిగా పనిచేస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించాడు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, పార్కింగ్ ప్రదేశాల్లో ఆలయంలోకి వచ్చి వెళ్లే దారులు, క్యూ లైన్లలో, కళ్యాణ కట్ట, ధర్మ గుండం, ఆలయ ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్, ఆలయ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శివరాత్రి వేడుకను ఘనంగా నిర్వహించాలని సూచించాడు.
ASR: అభివృద్ధిలో పీసా కమిటీలే కీలకమని వై.రామవరం ఎంపీడీవో రవి కిషోర్ అన్నారు. పీసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బందికి గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహజ వనరులు ఇతర అభివృద్ధి పనులపై పీసా గ్రామ కమిటీలు స్వయం నిర్ణయాధికారం మేరకే అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
PDPL: సింగరేణి నర్సరీలలో పనిచేస్తున్న కార్మికులకు జీఓ ప్రకారం వేతనాలు, సీఎంపీఎఫ్, బోనస్, వైద్యం చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న, రాష్ట్ర నాయకులు నరేష్ సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ను కోరారు. గురువారం గోదావరిఖనిలో సీఎండీని కలిసి వినతిపత్రం అందజేశారు.
MNCL: వేమనపల్లి మండలంలోని నీల్వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం పరిధి కాటేపల్లి అటవీ బీట్ పరిధిలో అక్రమంగా చెట్లు నరికిన మానేపల్లి రాజన్న, మానేపల్లి నరేష్ పై కేసు నమోదు చేసి చెన్నూరు కోర్టులో హాజరు పరిచినట్లు నీల్వాయి ఎఫ్‌ఆర్‌ఓ అప్పలకొండ తెలిపారు. అక్రమంగా చెట్లను నరికి భూమి చదును చేసినందుకు అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ELR: ఎక్కడైనా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటే వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియచేయాలంటూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేశారు. గురువారం స్ధానిక కలెక్టరేట్‌లో బర్డ్ ఫ్లూ సంబంధిత అంశంపై జిల్లాలో తీసుకున్న చర్యలను వివరించారు. దీనిపై కమాండ్ కంట్రోల్ 9966779943 నంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.
PPM: విద్యార్థుల బంగారు భవితకు ప్రామాణిక విద్య, మెరుగైన ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. కొమరాడ మండలం విక్రమపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గురువారం సందర్శించారు. విద్యార్థినీ, విద్యార్థుల ముఖాముఖి మాట్లాడి పాఠ్యాంశాలు, ఆంగ్ల భాషపై ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించారు.
KNR: మానకొండూరు మండలం ఊటూరులోని ఇసుక రిచ్ పాయింట్ వద్ద రవాణా, రెవిన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు గురువారం తనిఖీలు చేశారు. రీచ్ రికార్డులను పరిశీలించారు. ఇసుక యార్డుకు వాహనాలు వెళ్లే దారిని పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. అనుమతి కంటే ఎక్కువ లోడును తరలిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
SKLM: ఈనెల 23న జరగనున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి జె. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని ఐక్యవేదిక కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడానికి ఐదు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
KKD: పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంప్రదాయ కమిటీ సభ్యులుగా ఎంపీ సాన సతీష్ బాబు ఎంపిక కావడం పట్ల కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మేకా లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం లక్ష్మణ్ ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే సాన సతీష్ బాబుకు ఉన్నత పదవులు లభించాయన్నారు.
NLD: ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానం ఉదయం 4 నుండి 7 గంటల వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు. కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
KRNL: కోడుమూరు పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆలయాన్ని మాజీ కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైసీపీ ఇన్‌ఛార్జ్ ఆదిమూలపు సతీష్, జడ్పీటీసీ సభ్యులు రఘునాథ్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం వారు చౌడేశ్వరిదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సారె సమర్పించారు. తేరుబజార్ కాలనీ నుంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
EG: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వున్న చేపలు చేర్వుల్లో చచ్చిన కోళ్ళు చేపలకు మేతగా వేస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. జిల్లా లో చాలా పౌల్ట్రీల్లో వేలాది కోళ్ళు చనిపోతున్నాయి. పౌల్ట్రీ రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఇది అత్యంత ప్రమాదమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.