కృష్ణా: బాపులపాడులో ఇంటి పన్నుల వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. 12 ఏళ్ల క్రితం పెంచిన పన్నులు సరికాదని గ్రామసభలో అధికారులు అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు తగ్గింపు చర్యలు చేపట్టలేదని సామాజికవేత్త V.రాము, న్యాయవాది G.విజయబాబు శుక్రవారం విమర్శించారు. పన్నులు చెల్లించలేదంటూ కుళాయిలకు డమ్మీలు వేయడం, చెత్త సేకరణ నిలిపివేయడం చట్ట విరుద్ధమన్నారు.