KDP: సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిల్లను, 3ఆటోలను స్వాధీనం చేసుకున్నామని ముద్దునూరు సీఐ నగేష్ బాబు తెలిపారు. శనివారం నాడు ముద్దునూరు గ్రామంలో LM కాంపౌండ్ ప్రాంతంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి వాహనానికి సంబంధిత రికార్డులన్నీ క్షుణ్ణంగా ఉండాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎర్రగుంట్ల, తాళ్ల పొద్దుటూరు, కొండాపురం సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.