• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రైలు ప్రమాదంలో జిల్లా వాసి మృతి

BDK: వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఇంటికన్నె-నెక్కొండ మధ్య రైలు నుంచి జారిపడి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన పెంటయ్య (48) మృతి చెందారు. మృతుని సెల్ ఫోన్ సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జీఆర్పీ సీఐ సురేందర్ బుధవారం తెలిపారు. రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు.

March 19, 2026 / 07:02 AM IST

జిల్లా ప్రజలకు ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు

NZB: జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.

March 19, 2026 / 07:01 AM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

KMR: ఉగాది ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. కొత్త ఆశలు, ఆశయాలతో ప్రారంభమయ్యే ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరారు.

March 19, 2026 / 07:01 AM IST

రైతులకు పథకాల అవగాహన కార్యక్రమం

KRNL: కౌతాళం పట్టణంలో బుధవారం ‘రైతన్న మీకోసం వారోత్సవాలు’ మూడో రోజు కార్యక్రమం జరిగింది. టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాకేష్ రైతుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

March 19, 2026 / 07:00 AM IST

నేడు కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

W.G: భీమవరంలోని కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఈమని సోమయాజులు ఘనాపాటి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, మహా ఆశీర్వచనం, కవి సమ్మేళనం ఉంటాయని పేర్కొన్నారు. ఇదే వేదికపై ప్రముఖ కవులు తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి, డాక్టర్ గొర్తి సుబ్రహ్మణ్యంలను ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. 

March 19, 2026 / 06:58 AM IST

ధోనీలాంటి వ్యక్తి అరుదు: రైనా

ధోనీతో తన అనుబంధం గురించి గతంలో సురేష్ రైనా చెప్పిన మాటలు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. ధోనీ సారథ్యంలో అటు భారత్, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఈ మిస్టర్ IPL.. ‘మహీలాంటి వ్యక్తి శతాబ్దానికొకరే పుడతారు. కోహ్లీ, రోహిత్, నేను.. చాలా మందిని తీర్చిదిద్దాడు’ అని చెప్పుకొచ్చాడు. కాగా 2020లో ఆటకు ధోనీ వీడ్కోలు పలికిన కొన్నిగంటల్లోనే రైనా కూడా గుడ్ బై చెప్పాడు.

March 19, 2026 / 06:57 AM IST

మనస్థాపంతో గడ్డి మందు తాగిన యువతి

KMM: ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానన్న భయంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లరుపల్లికి చెందిన భవాని పీజీ పూర్తి చేసి, గత కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. రెండేళ్లుగా సరైన నోటిఫికేషన్లు రాకపోవడం, ఉద్యోగం వస్తుందో లేదోనన్న ఆందోళనతో నిన్న మనస్తాపం చెంది గడ్డిమందు తాగింది. పూర్తి సమాచారం తెలియల్సి ఉంది.

March 19, 2026 / 06:56 AM IST

అమరావతి అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

NTR: అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి సీఆర్డీఏ అవసరాలపై బుధవారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ లక్ష్మీశ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ ఇతర నిర్మాణ సామగ్రి నిరంతర సరఫరా కల్పనపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సాధించాలన్నారు. ఇప్పటివరకు సుమారు 11 లక్షల టన్నుల నిర్మాణ సామగ్రికి అనుమతులు జారీ అయ్యాయని తెలిపారు.

March 19, 2026 / 06:55 AM IST

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: MLA

పల్నాడు: అమరావతి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇచ్చే మందులను పరిశీలించి ఆసుపత్రికి సరఫరా అవుతున్న మందుల వివరాలను ఎమ్మెల్యేకు సిబ్బంది విచారించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

March 19, 2026 / 06:55 AM IST

‘ధురందర్ 2’లో యామీ గౌతమ్ సర్ప్రైజ్ రోల్!

రణ్‌వీర్ సింగ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ మూవీలో నటి యామీ గౌతమ్ ‘డాక్టర్ షాజియా బానో’గా సర్‌ప్రైజ్ రోల్‌లో మెరవనుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆమె పాత్ర కథను మలుపు తిప్పనుందని సమాచారం. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ నటించిన ఈ క్రేజీ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

March 19, 2026 / 06:54 AM IST

బాపట్లలో విషాదం.. అప్పుల బాధతో విద్యార్థి ఆత్మహత్య

బాపట్ల మండలంలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బొత్స దిలీప్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుక్కలవారిపాలెం చెరువులో మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.

March 19, 2026 / 06:53 AM IST

మే లో CBSE రెండో విడత పది పరీక్షలు

సీబీఎస్ఈ మే నెలలో నిర్వహించే పదో తరగతి రెండో విడత బోర్డు పరీక్షల కోసం అభ్యర్థుల జాబితా స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31 వరకు కొనసాగనుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది నుంచి రెండుసార్లు చేపట్టనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో మొదటి విడత పరీక్షలు నిర్వహించారు.

March 19, 2026 / 06:50 AM IST

విషాదం.. పిడుగు పడి వ్యక్తి మృతి

KDP:  జిల్లా కాశీనాయన మండలం చిన్నాయపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(60) బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో వర్షంతో పాటు పిడుగు పడింది. ఈ క్రమంలో నారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ పెద్ద కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

March 19, 2026 / 06:47 AM IST

చీరాల స్పెషల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్

బాపట్ల: చీరాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీని ప్లాస్టిక్ వాడకం రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని గతంలోనే తీర్మానం చేసుకున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తానని చెప్పారు.

March 19, 2026 / 06:45 AM IST

గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులు అరెస్టు

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని బోడాగుట్ట వద్ద పోలీసులు గంజాయి సేవిస్తున్న నలుగురిని పట్టుకున్నారు. బుధవారం రాత్రి ఎస్సై పస్తం శ్రీనివాస్ సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని. జన్ను ప్రణీత్ కుమార్, కొత్తూరు భాను ప్రసాద్, జంపాల లక్ష్మణ్, ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

March 19, 2026 / 06:44 AM IST