W.G: భీమవరంలోని కలెక్టరేట్లో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఈమని సోమయాజులు ఘనాపాటి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, మహా ఆశీర్వచనం, కవి సమ్మేళనం ఉంటాయని పేర్కొన్నారు. ఇదే వేదికపై ప్రముఖ కవులు తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి, డాక్టర్ గొర్తి సుబ్రహ్మణ్యంలను ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.