GDL: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు నూతన నిబంధనలను అమలు చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ మార్పులను గమనించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే బుకింగ్ చేయాలని సూచించారు.