కోనసీమ: రామచంద్రపురం మండలం వెలంపాలెం మసీదులో గురువారం జరిగిన రంజాన్ తోఫా కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ ముస్లిం మహిళలకు కానుకలు అందజేశారు. భక్తిభావానికి, దాన గుణానికి రంజాన్ మాసం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మతసామరస్యమే భక్తి భావానికి మార్గమని మంత్రి పేర్కొన్నారు.