W.G: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శేషవతారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. వన్ టౌన్ సీఐ నాగరాజు ఆయనను ఘనంగా సత్కరించారు. 36 ఏళ్లుగా అంకితభావంతో సేవలందించినందుకు ఈ గౌరవం దక్కడం అభినందనీయమని కొనియాడారు. తోటి సిబ్బంది శేషవతారానికి శుభాకాంక్షలు తెలిపారు.