TG: అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234కోట్లతో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తాము పాలకులం కాదని.. ప్రజలకు సేవకులం అని స్పష్టం చేశారు. ప్రజలే తమకు పరమావధి అని తెలిపారు.