E.G: కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేందుకు దృష్టి సారించిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతకు మంచి అవకాశాలు కల్పించాలనేది లక్ష్యమన్నారు. గత 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. నిరుద్యోగులు కృషితో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.