GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మైనార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం పట్టణంలోని మోమిన్ మొహల్లాలో ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందుకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మైనార్టీ నాయకులు ఫయాజ్, షరీఫ్ ఉన్నారు.