AP: మాజీ సీఎం జగన్ ఏరోజైనా భార్యతో కలిసి తిరుమలకు వచ్చారా? అని ఎమ్మెల్యే పులివర్తి నాని నిలదీశారు. సతీమణితో కలిసి పట్టువస్త్రాలను సమర్పించారా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో తిరుమలను అపవిత్రం చేశారని మండిపడ్డారు. రోజా మరోసారి నోరుపారేసుకుంటే మహిళలు ఊరుకోరని హెచ్చరించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.