AP: సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట భువనేశర్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ ఉన్నారు. ఈ మేరకు రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని సీఎం కుటుంబం దర్శించుకోనుంది. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొననున్నారు. అనంతరం ఎస్సీ అన్నప్రసాదం ట్రస్టుకు ఒకరోజు అన్నవితరణ ఖర్చు ఇవ్వనున్నారు.