AP: తిరుమలలో ప్రసాదాల కల్తీ గుర్తించే అత్యాధునిక ఫుడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. రేపు ఈ ల్యాబ్‌ను CM చంద్రబాబు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పుణ్యక్షేత్రంలో ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. ఇందులో నెయ్యి సహా లడ్డూ తయారీలో వాడే 60 పదార్థాల పరీక్షలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.