W.G: రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినట్లుగానే 10,500 పోస్టులతో సీఎం చంద్రబాబు ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని చెప్పుకొచ్చారు.