ప్రకాశం: తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలో శుక్రవారం పిడుగు పడి మంగమూరి గంగరాజుకు చెందిన గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు వెంటనే మార్కాపురం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతన్నల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.