WNP: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. వనపర్తి పట్టణం 8వ వార్డులో షబ్బీర్, హలీం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కర్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.