KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని శ్రీరామన వమి వార్షిక బ్రహ్మోత్సవాలకు శోభాయమానంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రాకారం గోడలకు రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరణ చేశారు. దీంతో ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో అధిక కాంతినిచ్చే దీపాలను ఏర్పాటు చేయడంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.