KMR: మహమ్మద్‌నగర్ మండలం బుర్గల్ గ్రామంలో ఓ మహిళ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడబోతుండగా.. బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి ట్యాంకర్ పైకి ఎక్కి ఆమెతో మాట్లాడి కిందకు తీసుకువచ్చారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. స్రవంతి అనే యువతి కుటుంబ విభేదాల నేపథ్యంలో గ్రామంలోని 60 అడుగుల ఎత్తున నీటి ట్యాంకర్ పైకి ఎక్కింది.