TG: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు Dy CM భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు.