KDP: మైదుకూరు మండలం సర్వయపల్లెలోని శ్రీ రామాలయం మరమ్మతుల కోసం గురువారం మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ మూలే భరత్ కుమార్ రెడ్డి రూ.50,016 విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా గ్రామ పెద్దలు, దేవస్థాన కమిటీ సభ్యులు ఆయన సేవా భావాన్ని అభినందించారు. ఆలయ అభివృద్ధికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి సహకరించాలన్న సూచించారు.