PLD: మాచర్ల పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ వేణుబాబు బుధవారం పరిశీలించారు. పురపాలక సంఘ పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కమిషనర్ అన్నారు. పురపాలక సిబ్బంది తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛ మాచర్లకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్నారు.
VZM: జిల్లాలోని ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, మేజర్ పంచాయితీలు, జాతీయ రహదారిపై ముందుగా కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం క&zwnj...
సిద్దిపేట: రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో బీసీల రిజర్వేషన్, మున్నూరు కాపుల జనాభాను తగ్గించి చూపెట్టారని కాపు కులస్తులు డిమాండ్ చేశారు.బీసీల రిజర్వేషన్ రీసర్వే చేయాలని రాష్ట్ర మున్నూరు కాపు పిలుపుమేరకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా హుస్నాబాద్ పోలీసులు హుస్నాబాద్ మున్నూరు కాపు కులస్తులను అరెస్టు చేశారు.
VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం న్యూ ఢిల్లి ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన పార్లమెంట్ నిధులలో మొదటి కోటి రూపాయలు విజయనగరం పార్లమెంట్‌లోని చేనేత రంగ అభివృద్ధి కై ఖర్చు చేయబోతునట్లుగా తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
KRNL: కోడుమూరు మండలంలో చౌడేశ్వరి దేవి అమ్మవారికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి బుధవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా తమ అభిమాన నాయకుడికి స్థానిక నేతలు, గ్రామస్థులు డప్పు మేళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్వహకులు, ఆలయం మర్యాదల చేత ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్య క్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందంబా కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకోవడం గొప్ప విషయమని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
KRNL: రాష్ట్రంలో కౌలు రైతులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కౌలు రైతు సంఘం పట్టణ కార్యదర్శి గోపాల్, సీపీఐ కార్యదర్శి మండల కార్యదర్శి కల్లుబావి రాజు కోరారు. బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కౌలు రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కేటాయించాలన్నారు. రైతు ఆత్మహత్యలలో కౌలు రైతుల సంఖ్య అధికంగా ఉందని గుర్తు చేశారు.
SRD: పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ… రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచెయ్యాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు అసెంబ్లీ ప్రభారి శ్రీనివాస్ ఉన్నారు.
AP: ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కోళ్లు మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ల్యాబ్‌కు పంపాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేదించాలని అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల చేత ఈ మెగా టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. ఇప్పటికే కమిన్స్, మార్ష్, హాజిల్‌వుడ్, స్టోయినిస్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
SRD: నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామానికి చెందిన మైపాల్ ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 28,500 చెక్కును నారాయణఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందజేశారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజాసేవ కోసం నిరంతరం కృషి చేస్తానని భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో మాజీ ఎంపీటీసీ భూపాల్ ఉన్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీలోని దబిడి దిబిడి పాటపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంట్రవర్సీపై నటి ఊర్వశి రౌతేలా స్పందించారు. ‘రిహార్సల్స్ సమయంలో అనుకున్న విధంగా.. ఎంతో ప్రశాంతంగా ఈ పాటను చేశాము. కానీ ఉన్నట్టుండి ఈ పాటపై అంతటి నెగిటివిటీ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అసలు దాన్ని అంచనా వేయలేకపోతున్నాం’ అని పేర్కొన్నారు.
MDK: రామయంపేట మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన రాజలింగానికి సీఎం సహాయ నిధి చెక్కును మాజీ సర్పంచ్ కాముని రవీంద్ర బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితునికి మెరుగైన వైద్య నిమిత్తం రూ. 36 వేల సీఎంఆర్ఎఫ్ చెప్పిన అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
JGL: వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనను ఘనంగా సన్మానించారు.
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలోని శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘపౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆలయ కొండకు ఇరువైపులా గిరి ప్రదర్శన చేశారు. ప్రతి ఏడాది మాఘపౌర్ణమి సందర్భంగా ఈ గిరి ప్రదర్శన చేస్తున్నట్లు వీరు తెలిపారు.