KDP: ఈనెల 31 లోపు ఇంటి, నీటి పన్నులు తప్పక చెల్లించాలని ఇంఛార్జ్ ఎంపీడీవో వీరభద్రుడు పేర్కొన్నారు. ఆదివారం ముద్దనూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పన్నులు చెల్లించి గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను, వ్యాపారవేత్తలను కోరారు. పన్నుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.