NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న మహాత్మా గాంధీ ఆలయానికి విద్యార్థుల తాకిడి పెరిగింది. గత రెండు, మూడు రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పాఠశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రలలో భాగంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కూరెళ్ళ నరసింహచారి ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యార్థులకు కంకణాలను పంపిణీ చేశారు.