BHPL: జిల్లాలోని రైతులకు సబ్సిడీపై జిప్సం పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) బాబురావు తెలిపారు. జిప్సం వాడకం వల్ల సౌడు భూముల స్వభావం మెరుగుపడి, నేలలో కాల్షియం, సల్ఫర్ మూలకాలు పెరుగుతాయని వివరించారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి ఒక టన్నుకు కేవలం రూ.566 చెల్లిస్తే 90 శాతం రాయితీతో సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు.