HYD: సైబరాబాద్ వ్యాప్తంగా వీకెండ్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 262 మంది పట్టుబడ్డారు. వీటిలో 205 బైకులు, 50 కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.