NGKL: మండల కేంద్రంలో MP నిధులతో నూతనంగా నిర్మిస్తున్న MNREGS సీసీ రోడ్డు పనులను బీజేపీ రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. నిర్ణీత కాల వ్యవధిలో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టరుకు చెప్పారు.