TG: హనుమకొండలో హమాలీ మహాగర్జన సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఐక్యంగా ఉండాలని సీతక్క సూచించారు. కార్మికుల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. కార్మికులకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆలస్యమైనా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.