PLD: దాచేపల్లి(మం) పెదగార్లపాడులో ఓ పురాతన విగ్రహం బయటపడింది. జిల్లా పరిషత్ హైస్కూల్లో అభివృద్ధి పనులు చేస్తుండగా ఈ విగ్రహం బయటపడింది. ఇది సీతారాముడు, లక్ష్మణుడు విగ్రహంగా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి విగ్రహానికి పూజలు చేస్తున్నారు. విగ్రహం ఏ కాలం నాటిది అనే విషయంపై చర్చ జరుగుతోంది.