AP: మెయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. ‘BRS మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో కలిసి పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో దొరకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏలూరు ఎంపీకి, మొయినాబాద్ ఫామ్ హౌస్‌తో ఏం సంబంధం? డ్రగ్స్ మూలాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి’ అంటూ డిమాండ్ చేశారు.