MDCL: అల్వాల్లో కనాజిగూడలోని ప్రుడెన్షియల్ బ్యాంక్ కాలనీలో ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్, మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ (ఐఏఎస్), హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి రోడ్ల పక్కన గడ్డి తొలగించారు.