కవాసకి నింజా ZX-6Rపై డీలర్లు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇందులో రూ.2.74 లక్షల నగదు తగ్గింపుతో పాటు రూ.98 వేల విలువైన యాక్సెసరీస్ ఉచితంగా లభిస్తాయి. దీంతో రూ. 15.43 లక్షల ఆన్-రోడ్ ధర గల బైక్ రూ.12.69 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. పాత స్టాక్ క్లియర్ చేసేందుకు ఇస్తున్న ఈ ఆఫర్ సూపర్ బైక్ లవర్స్‌కు మంచి అవకాశం. ఇది హోండా CBR650R, ఏప్రిలియా RS 660లకు గట్టి పోటీ.