ASR :వేసవి నేపథ్యంలో చింతపల్లి మేజర్ పంచాయతీలో తాగునీటి సమస్య తలెత్తకుండా సర్పంచ్ దురియా పుష్పలత చర్యలు చేపట్టారు. కొన్ని వీధుల్లో మోటార్లు చెడిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోవడంతో, ప్రభావిత ప్రాంతాలకు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయిస్తున్నారు. మోటార్ల మరమ్మతులు పూర్తయ్యే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని తెలిపారు.