PLD: నకరికల్లు మండలంలోని కండ్లగుంట సబ్ స్టేషన్లో కొత్త బ్రేకర్ ఏర్పాటు పనులు సోమవారం జరగనున్నాయి. దీంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కండ్లగుంట, చాగల్లు, చీమలమర్రి, దేచవరం, రూపేనగుంట గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈఈ జీ. సుచరిత తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.